హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బాణసంచా నిప్పురవ్వలతో గుట్టపై మంటలు

WGL: వరంగల్ కరీమాబాద్‌లోని ఉర్సు రంగలీల మైదానంలో మంగళవారం నిర్వహించిన విజయదశమి వేడుకల్లో బాణసంచా నిప్పురవ్వలు ఉరుసుగుట్టపై పడటంతో, చెట్లు అంటుకుని మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు అధికారులు చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపించారు. వేడుకల్లో సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్లే పర్యావరణానికి నష్టం వాటిల్లుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.