హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు మదనపల్లెలో పోలీసు సంస్మరణ దినోత్సవం: SP

అన్నమయ్య: మదనపల్లె పట్టణంలోని బీటీ కళాశాల పోలీస్ పరేడ్ మైదానంలో ఇవాళ ఉదయం 7.30 గంటలకు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించనున్నట్లు జిల్లా SP ధీరజ్ తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులకు స్మృతి పరేడ్ నిర్వహించి, అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించనున్నట్లు పేర్కొన్నారు.