హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేదలకు అండగా పాలకొల్లు వాకర్స్ క్లబ్

W.G: కోనసీమ జిల్లాకు చెందిన పేదల విజ్ఞప్తి మేరకు పాలకొల్లు వాకర్స్ క్లబ్ సాయం అందించింది. అధ్యక్షుడు తటవర్తి సుధాకరరావు ఆధ్వర్యంలో ముత్యాలపాలెం మేరీ కుమారి, ఆశాజ్యోతికి రూ.25,000, ఏడిద గంగరాజుకు రూ.10,000 విలువైన మందులు పంపిణీ చేశారు. అలాగే నగరం గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థికి రూ.7,000 విలువైన సైకిల్ అందజేశారు.