KDP: VN పల్లె మండలం సర్వరాజుపేట సమీపంలోని మునీశ్వరస్వామి పుట్ట వద్ద కొలువైన దుర్గమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవం మంగళవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి మేళతాళాలు, బాణసంచా నడుమ ఉత్సవం జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కాయ కర్పూరం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాలతో పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది
ఆంధ్రప్రదేశ్
VIDEO: వైభవంగా దుర్గమ్మ అమ్మవారి గ్రామోత్సవం


