హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంతలమయంగా రహదారి..ప్రయాణికుల ఇక్కట్లు

BHNR: భూదాన్ పోచంపల్లి మండలం భీమనపల్లి నుంచి చౌటుప్పల్ వెళ్లే రహదారి గుంతలమయంగా మారింది. పోచంపల్లి నుంచి చౌటుప్పల్, కొయ్యలగూడెం వెళ్లే విద్యార్థులు, ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దెబ్బతిన్న రోడ్డుపై ప్రయాణం కష్టంగా మారిందని వాపోతున్నారు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టి తమ ఇబ్బంద తొలగించాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.