హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్తపాలెంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక

WG: కొత్తపాలెం గ్రామ మాజీ సర్పంచ్ లోకం నాగలక్ష్మి, ఆమె భర్త లోకం వెంకటేశ్వరరావు (నాని) మంగళవారం వైసీపీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. నరసాపురంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, టీడీపీ నాయకులు కొవ్వలి రామ్మోహన్ నాయుడు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.