VZM: బొబ్బిలిలో ఇవాళ్టి నుంచి జరగనున్న MPTC, ZPTC నామినేషన్లకు ర్యాలీలకు అనుమతి లేదని పట్టణ CI కె.నారాయణరావు స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ ఆమలులో ఉన్నందున సెక్షన్-30, సెక్షన్ 144 అమలులో ఉన్నాయని, నామినేషన్ వేసే అభ్యర్థులు ర్యాలీ చేయకుండా శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు. నామినేషన్ వేసేవారితో నలుగురికి మించి రాకూదన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నామినేషన్ల ర్యాలీలకు అనుమతి లేదు'


