హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధ్వానం‌గా ధరిపల్లి-ఉప్పులింగాపూర్ రోడ్డు

MDK: ధరిపల్లి-ఉప్పులింగాపూర్ రోడ్డు అధ్వానం చిన్నశంకరంపేట మండలం ధరిపల్లి నుంచి ఉప్పులింగాపూర్‌కు వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. రోడ్డు నిర్మించి సుమారు పదేళ్లు గడిచినా మరమ్మతులు చేపట్టేందుకు నాయకులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. జాతీయ రహదారికి సమీపంలో ఉండటంతో ఈ మార్గంలో ప్రతిరోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.