హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు

సత్యసాయి: పుట్టపర్తి పురపాలక సంఘం ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 21న మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉందని కమిషనర్, సహాయ ఎన్నికల అధికారి తెలిపారు. అభ్యర్థులు చిన్నపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపసంహరణ పత్రాలు సమర్పించాలని సూచించారు. గడువు ముగిసిన వెంటనే తుది పోటీ అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని వెల్లడించారు.