హైదరాబాద్: 28°C
తెలంగాణ

నర్సంపేటలో రావణవధ

WGL: విజయదశమి పురస్కరించుకొని నర్సంపేటలోని స్థానిక అంగడి మైదానంలో నిర్వహించిన రావణ వధ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి వేడుకలు జరుపుకొంటున్నట్లు నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్ శ్రీ లక్ష్మీ తెలిపారు. అంతకుముందు నర్సంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శమీ పూజ వైభవంగా నిర్వహించారు.