హైదరాబాద్: 28°C
వార్తలు

స్థానిక ఎన్నికలపై అవగాహన కార్యక్రమం

NLR: దుత్తలూరు మండలంలోని నందిపాడు, వెంకటంపేట, పాపంపల్లి గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎస్సై బి. మహేంద్ర అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని సూచించారు.