హైదరాబాద్: 28°C
తెలంగాణ

జమ్మి పూజల్లో పాల్గొన్న కవ్వంపల్లి

KNR: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మానకొండూర్ మండల కేంద్రంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించిన జమ్మి పూజల్లో ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడు మీద మంచి విజయం సాధించడమే విజయదశమి పండుగ సందేశమని పేర్కొన్నారు.