హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే‌కు వినతి

VKB: తాండూరు మున్సిపాలిటీ 10, 11వ వార్డుల పరిధిలోని న్యూ ఆదిత్య ఆసుపత్రి నుంచి హనుమాన్ ఆలయం వరకు అధ్వానంగా మారిన రోడ్డుకు నూతన సీసీ రోడ్డు వేయాలని కౌన్సిలర్‌లు బంటు వేణు, అల్లాపూర్ శ్రీకాంత్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే, దీపావళి తర్వాత నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభిస్తామని భరోసా ఇచ్చారు.