హైదరాబాద్: 28°C
క్రైమ్

MVSR కళాశాల ఘటన.. ముగ్గురు అరెస్ట్

TG: హైదరాబాద్ శివారులోని నాదర్‌గుల్ MVSR కళాశాల ఘటనలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈవెంట్ మేనేజర్ సాకేత్ కంపెనీకి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. లైటింగ్ పోల్‌కు సరైన సపోర్టు లేకుండా ఏర్పాటు చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి MVSR కళాశాల మేనేజ్‌మెంట్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.