TG: హైదరాబాద్‌లోని మలక్‌పేటలో జింక మాంసం కలకలం రేపింది. వాహన తనిఖీల్లో ఓ కారులో జింక మాంసంతో పాటు రైఫిల్, 8 బుల్లెట్లు, 12 ఖాళీ కార్ట్రిడ్జ్‌లు, రెండు నైట్ విజన్ టెలిస్కోప్‌లు, బ్యాటరీ లభ్యమయ్యాయి. దీంతో హుస్సేన్, ఒమర్, హమీద్ అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కారును సీజ్ చేశారు. కర్ణాటకలోని కలబురగి అటవీ ప్రాంతంలో వీరు జింకలను వేటాడినట్లు గుర్తించారు.
క్రైమ్
జింక మాంసం కలకలం.. ముగ్గురు అరెస్ట్


