హైదరాబాద్: 28°C
క్రైమ్

స్కూటీని ఢీకొట్టిన కారు.. అన్నాచెల్లెళ్ల మృతి

TG: రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న అన్నాచెల్లెళ్లను కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. పెద్దఅంబర్‌పేటకు చెందిన రేఖ, నవీన్ చనిపోగా చిన్నారికి గాయాలయ్యాయి. చెల్లిని.. అన్న దసరాకు శంషాబాద్ నుంచి తీసుకువస్తుండగా ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.