హైదరాబాద్: 28°C
క్రైమ్

సాఫ్ట్‌వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం

TG: హైదరాబాద్‌ మాదాపూర్‌లోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం కలకలం సృష్టించింది. యూనిస్ట్రింగ్‌ టెక్‌ సొల్యూషన్స్‌కు చెందిన యాంటీ డ్రోన్‌ సిస్టమ్స్ గోదాములో మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనకు గురైన ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.