భరూచ్ జిల్లాలోని(గుజరాత్) సింజీల్ ఫార్మాకెమ్ కెమికల్ ఫ్యాక్టరీలో నిన్న రాత్రి రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. 15 కి.మీ. మేర ఈ శబ్దం వినిపించిన ఈ పేలుడు ధాటికి మిథిలీన్ డైక్లోరైడ్ గ్యాస్ లీకై పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకుంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన అధికారులు దర్యాప్తు చేపట్టారు.
క్రైమ్
కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి


