హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మానవతా దృక్పథం చాటుకున్న ఎస్సై

ATP: కంబదూరు మండలం ఓబుగానిపల్లిలో మొబైల్ ఛార్జింగ్ మంటలతో నిత్యావసరాలు కాలిపోయిన దివ్యాంగురాలు గొల్ల పూజారి కావ్య కుటుంబాన్ని ఎస్సై లోకేష్ పరామర్శించారు. బాధితురాలి ఇంటికి చేరుకుని రెండు బస్తాల బియ్యం, కూరగాయలు, రూ.5 వేల నగదు అందజేశారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచిన ఎస్సైని గ్రామస్థులు అభినందించారు.