హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

5 పట్టణాల్లో 144 సెక్షన్: ఎస్పీ

ATP: అనంతపురం నగరంతో పాటు తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం పట్టణాలలో 30 పోలీస్ యాక్ట్, 144 సెక్షన్ అమలులో ఉన్నాయని జిల్లా ఎస్పీ పి. జగదీష్ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, సభలు నిర్వహించడం, ఐదుగురికి మించి గుమిగూడటం నిషేధమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.