KNR: కరీంనగర్ ఐడీఓసీలో శుక్రవారం రాత్రి ఉద్యోగుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ చిత్రా మిశ్రా మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడి సందడి చేశారు. వివిధ శాఖల ఉద్యోగినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ఇలాంటి వేడుకలు ఉద్యోగుల మధ్య ఐక్యత పెరుగుతుందన్నారు.
తెలంగాణ
ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడిన కలెక్టర్


