హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణాలో శనివారం మోస్తరు వర్షం

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు చెదురుమదురు భారీ వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. శనివారం కృష్ణా సహా బాపట్ల, నెల్లూరు, కడప, చిత్తూరు, అల్లూరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షం కురవవచ్చు. ఉరుములు వచ్చేటప్పుడు చెట్ల కింద, పెద్ద హోర్డింగుల వద్ద నిలబడవద్దని ప్రజలను అప్రమత్తం చేశారు.