హైదరాబాద్: 28°C
వార్తలు

శాకంబరి ఆలయం వద్ద చెత్త సమస్య

గుంటూరులో శాకంబరి దేవి ఆలయం సమీపంలో మూడు రోజులుగా చెత్త తొలగించకపోవడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దసరా శరన్నవరాత్రులు, శాకంబరి ఉత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ ఉన్నా చెత్తబుట్టలు నిండి, పూజా సామగ్రి పరిసరాల్లో పడి ఉంది. రోజూ శుభ్రం చేయాలని నగరపాలక సంస్థ సిబ్బందిని కోరినా స్పందన లేదని స్థానికులు చెబుతున్నారు. ఉత్సవాల వరకు రోజూ శుభ్రం చేయాలన్నారు.