హైదరాబాద్: 28°C
వార్తలు

'పోలీసు సిబ్బంది సంక్షేమమే ప్రాధాన్యం'

GNTR: పోలీసు సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. గుంటూరు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పోలీస్‌ సిబ్బంది గ్రీవెన్స్‌ డేలో ఆయన పాల్గొని సిబ్బంది నుంచి వివిధ సమస్యలపై వినతులు స్వీకరించారు. సెలవులు, ఇతర పరిపాలనా అంశాలకు సంబంధించిన సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు.