హైదరాబాద్: 28°C
క్రైమ్

ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి

రాజస్థాన్‌లోని కోటాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌ వేపై ఓ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రయాణికులు మృతి చెందగా, పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.