ఆసిఫాబాద్ జిల్లాలో సెగ్రిగేషన్ షెడ్లు నిరుపయోగంగా మారాయి. జిల్లాలోని 334 గ్రామ పంచాయతీల్లో రూ.83.5 లక్షలతో వీటిని నిర్మించారు. తొలుత కంపోస్టు ఎరువుల తయారీ చేపట్టినా, అధికారుల పర్యవేక్షణ లేక నిలిచిపోయింది. ప్రస్తుతం సేకరించిన చెత్తను డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. లక్షల ఖర్చుతో నిర్మించిన షెడ్లను వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
డంపింగ్ యార్డులకే పరిమితమైన చెత్త సేకరణ


