హైదరాబాద్: 28°C
వార్తలు

రెండు బైకులను ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి

TG: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని గ్రానెట్ పరిశ్రమ వద్ద కారు బీభత్సం సృష్టించింది. రెండు బైకులను ఢీకొని కారు బోల్తా పడింది. కారులో ఉన్న వ్యక్తి మృతిచెందాడు. బైక్ పై ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.