హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన మంత్రి

HYD: అమరజ్యోతి ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి సీతక్క మహిళలతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వయంగా రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి, పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకున్నారు. ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ సంబరాలతో ప్రాంగణమంతా పండుగ వాతావరణం నెలకొంది.