హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువతపైనే అత్యధిక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

HYD: నగరంలో అక్టోబర్ 16, 17 తేదీల్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 417 మంది పట్టుబడ్డారు. వీరిలో 353 మంది ద్విచక్ర వాహనదారులు, 25 మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. అత్యధికంగా 21–30 ఏళ్ల వయసు వారిపై 158 కేసులు నమోదయ్యాయి. మద్యం తాగి వాహనాలు నడపవద్దని, ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.