RR: వెంకటేశ్వర నగర్ డివిజన్లోని హనుమాన్ నగర్కు చెందిన మెరీనాకు అత్యవసర వైద్య చికిత్స కోసం మంజూరైన రూ.లక్ష సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ పత్రాన్ని ఎమ్మెల్యే గాంధీ బాధిత కుటుంబానికి అందజేశారు. పేద కుటుంబాలపై వైద్య ఖర్చుల భారం తగ్గించడంలో సీఎం సహాయ నిధి అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కాశీనాథ్ యాదవ్, తిరుపతి, సరిత తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే గాంధీ అండ


