AP: కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బద్వేలులోని సుమిత్రానగర్లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. సాయిబాబా అనే వ్యక్తి ఆమె గొంతు కోసి పరారయ్యాడు. అప్రమత్తమైన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే మార్గమధ్యలోనే మహిళ మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
క్రైమ్
గొంతు కోసి మహిళ దారుణ హత్య


