హైదరాబాద్: 28°C
క్రైమ్

7.0 తీవ్రతతో భారీ భూకంపం

రష్యాలోని కమ్చాట్కా ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.0గా నమోదైంది. ఇది 140 కి.మీ లోతులో కేంద్రీకృతమైనట్లు EMSC తెలిపింది. ప్రాథమిక నివేదికల ప్రకారం ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. కాగా, ఈ ప్రాంతంలో గతంలోనూ భూకంపాలు వచ్చాయి.