హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయ తైక్వాండో పోటీలకు హర్షవర్ధన్ రెడ్డి

ATP: తాడిపత్రికి చెందిన హర్షవర్ధన్ రెడ్డి 70వ SGF జాతీయ తైక్వాండో పోటీలకు ఎంపికయ్యాడు. కశ్మీర్ శ్రీనగర్‌లో అక్టోబర్ 22న ప్రారంభమయ్యే పోటీల్లో పాల్గొంటాడు. ఆంధ్రప్రదేశ్ జట్టు కోచ్‌గా ఎం. సాయి బాబా ఎంపికయ్యారు. జాతీయ స్థాయికి ఎంపికైన హర్షవర్ధన్ రెడ్డి, సాయి బాబాలను తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు ఉప్పు శివయ్య అభినందించారు.