హైదరాబాద్: 28°C
వార్తలు

సామెత - దాని అర్థం

"అంత్య నిష్టూరం కన్నా, ఆది నిష్టూరం మేలు"
ఒక పనిని మొదలుపెట్టే ముందు దాని పర్యవసానాలు బాగా ఆలోచించి, ముందుగానే ఊహించి, సంబంధిత వ్యక్తులతో దానిని గురించి చర్చించి మొదలుపెట్టమని చెప్పేందుకు ఉద్దేశించినదే ఈ సామెత. కీడెంచి మేలెంచమనే సామెతకు ఇది కాస్త దగ్గరగా ఉంటుంది.