హైదరాబాద్: 28°C
క్రైమ్

చిన్నారిని హతమార్చిన కన్న తల్లి

TG: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్న తల్లి సైరాబాను రాయితో దాడి చేసి తొమ్మిదేళ్ల బాలిక జాస్మిన్‌ను హతమార్చింది.  తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.