TG: హైదరాబాద్ శివారు జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న ద్విచక్ర వాహనం చెట్టును ఢీకొనడంతో ఇద్దరు యువకులు గాల్లో ఎగిరిపడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో కాస్మోస్ (26), సుమిత్ (29) మృతి చెందగా, ఇందుకు సంబంధించిన భయానక దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
క్రైమ్
VIDEO: గాల్లో ఎగిరిపడి ఇద్దరు యువకులు మృతి

