హైదరాబాద్: 28°C
వార్తలు

పీహెచ్‌సీలో రాష్ట్ర ఆరోగ్య సంచాలకుడు తనిఖీ

KRNL: రాష్ట్ర ఆరోగ్య సంచాలకుడు డాక్టర్‌ వెంకట రమణ సోమవారం సీ.బెళగల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు ఇన్‌పేషెంట్ల వివరాలను తెలుసుకున్నారు. నవజాత శిశు సంరక్షణ గది, మందుల విభాగం, ప్రయోగశాల, రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ నాణ్యమైన సేవలందించాలని సూచించారు.