SKLM: ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ఆమదాలవలస మండలం వంజంగి గ్రామంలో సోమవారం రాత్రి పోలీసులు ఫుట్ మార్చ్ నిర్వహించారు. సీఐ సన్యాసినాయుడు, ఎస్సై బాలరాజు ఆధ్వర్యంలో పోలీసులు గ్రామంలో పర్యటించి ప్రజలకు ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పించారు. ఎన్నికల సమయంలో ఎటువంటి ఘర్షణలకు తావివ్వకుండా ఉండాలని తెలిపారు.
వార్తలు
VIDEO: పోలీసుల ఫుట్ మార్చ్


