HYD: సచివాలయంలో రెవెన్యూ శాఖ అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. భూభారతి చట్టం అమలు, పట్టాదారు పాస్బుక్కుల పంపిణీ, భూముల రీ-సర్వే, భూ సమస్యల పరిష్కారంపై చర్చించారు. ఇప్పటివరకు రైతులకు 12,40,366 పాస్‌బుక్కులు జారీ చేసినట్లు వెల్లడించారు. రెవెన్యూ సేవలను పారదర్శకంగా, వేగంగా అందించాలని అధికారులకు సూచించారు.
వార్తలు
రెవెన్యూ శాఖపై మంత్రి పొంగులేటి సమీక్ష


