హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిథిలావస్థలో రైతు వేదిక..పట్టించుకోని అధికారులు

WNP: పానగల్ మండలం కేతేపల్లిలోని రైతు వేదిక భవనం నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకుంది. తలుపులు విరిగిపోయి పాడుబడిన స్థితిలో కనిపిస్తోందని గ్రామ యువకుడు వెంకటేష్ తెలిపారు. రైతుల సమావేశాలు, అవగాహన కార్యక్రమాల కోసం నిర్మించిన భవనం నిరుపయోగంగా మారడంపై రైతులు, యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలన్నారు.