హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పారిశుద్ధ్య కార్మికులకు ఆత్మీయ సత్కారం

NLG: చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన బీజేపీ నేత కాసోజు శంకరాచారి దసరా పండుగ సందర్భంగా పంచాయతీ సిబ్బందిని తన ఇంటికి ఆహ్వానించి ఆత్మీయ సన్మానం చేశారు. పారిశుద్ధ్య, విద్యుత్, నీటి సరఫరా విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని సత్కరించి నూతన దుస్తులు అందజేశారు. గ్రామంలో ఆరోగ్య పరిరక్షణకు వారు చేస్తున్న కృషి అమోఘమని ఆయన కొనియాడారు.