హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురంలో వైసీపీ మేయర్ అభ్యర్థి పూజలు

ATP: అనంతపురం నగర మేయర్ YCP అభ్యర్థి రమేష్ గౌడ్ దసరా నవరాత్రి వేడుకల్లో భాగంగా నగరంలోని పాతూరు, కొత్తూరు అమ్మవారిశాలల్లో మంగళవారం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని అభిషేకాలు చేసి, ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.