హైదరాబాద్: 28°C
క్రీడలు

బవుమా సెంచరీ.. సఫారీలు భారీ స్కోర్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 425/9 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. 110 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో కెప్టెన్ టెంబా బవుమా (179) సంచలన ప్రదర్శనతో జట్టును ఆదుకున్నాడు. కెప్టెన్‌కు తోడుగా మార్కో యాన్‌సన్ (85), సైమన్ హార్మర్ (82) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ 5, స్టార్క్ 3 వికెట్లు పడగొట్టారు