హైదరాబాద్: 28°C
క్రీడలు

కోహ్లీలో ఇప్పటికీ అదే పరుగుల దాహం: భజ్జీ

కోహ్లీ అసాధారణ ప్రతిభావంతుడని హర్భజన్ సింగ్ అన్నాడు. కోహ్లీ పరుగుల దాహం, గెలవాలనే కసి ఇతరులకంటే చాలా భిన్నమని భజ్జీ కొనియాడాడు. ఇప్పటికీ కోహ్లీ అదే పరుగుల దాహంతో ఉన్నాడని తెలిపాడు. ముఖ్యంగా భారత క్రికెట్ జట్టులో ఆటగాళ్ల ఫిట్‌నెస్ కోహ్లీ వల్లే మెరుగుపడిందని చెప్పాడు. కోహ్లీ అరంగేట్రం సిరీస్‌లోనే అతడి ప్రతిభను చూసి, రికార్డులు బ్రేక్ చేస్తాడని ఊహించినట్లు తెలిపాడు.