KMM: దసరా వేళ అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దమ్మపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. గండుగులపల్లిలోని ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం దమ్మపేటలో జమ్మిచెట్టు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మొక్కను నాటారు. అలాగే పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన లాడ్జిని,ఆర్కే మెడికల్ స్టోర్‌ను ప్రారంభించారు.
తెలంగాణ
దమ్మపేటలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే


