హైదరాబాద్: 28°C
తెలంగాణ

రంజీ ట్రోఫీలో సత్తా చాటిన అదిలాబాద్ కుర్రాడు

ADB: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రంజీ ట్రోఫీలో ఆదిలాబాద్ క్రీడాకారుడు సెంచరీ సాధించి సత్తా చాటాడు. ఈ నెల 18న ప్రారంభమైన ఆంధ్ర వర్సెస్ HCA రంజీ మ్యాచ్‌లో 3వ రోజైన మంగళవారం మాలపాడులోని DVR గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆదిలాబాద్ కుర్రాడు కొడిమెల హిమతేజ 123 పరుగులతో నాట్ ఔట్‌గా నిలిచి హైదరాబాద్ జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు.