MDCL: ప్రతాపసింగారంలో ఏళ్ల చరిత్ర కలిగిన జమ్మి చెట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రహదారి నిర్మాణంలోనూ చెట్టును తొలగించకుండా అటు ఇటు రోడ్డు వేయడం ప్రకృతిపై స్థానికులకున్న గౌరవానికి నిదర్శనం. విజయానికి ప్రతీకగా భావించే జమ్మిచెట్టు గొప్పతనమే దానికి ఆ గౌరవాన్ని తెచ్చిపెట్టిందన్న భావన కలుగుతోంది. ఏటా దసరా పండుగకు చెట్టు కొమ్మలను ZPHSకు తీసుకెళ్లి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.
తెలంగాణ
ప్రతాపసింగారంలో ప్రత్యేక ఆకర్షణ జమ్మిచెట్టు


