హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటర్ల తీర్పు ఎప్పుడూ ప్రత్యేకమే..!

ASR: అరకులోయ మండలం పెదలబుడు పంచాయతీలో ఓటర్ల తీర్పు ఎప్పుడూ ఆసక్తికరమే. 2013లో వైసీపీ మద్దతుదారు సర్పంచ్‌గా గెలవగా, 2014లో పెదలబుడు పంచాయితీలోని 3 ఎంపీటీసీ స్థానాలనూ టీడీపీ కైవసం చేసుకుంది. 2021లో టీడీపీ మద్దతుదారుడు సర్పంచ్‌గా గెలవగా, మూడు ఎంపీటీసీలను వైసీపీ గెలుచుకుంది. ఈసారి పెదలబుడు ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.