హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ.3.72 లక్షలు

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి ఆలయంలో మంగళవారం భక్తులు వివిధ సేవల ద్వారా రూ.3,72,836 ఆదాయం సమకూర్చినట్లు ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 434 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 351 ద్విచక్ర వాహనాలకు పూజలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా 4,030 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించినట్లు వెల్లడించారు.