హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొండపి ఎంపీపీ బరిలో గొర్రెపాటి రామయ్య

ప్రకాశం: కొండపి టీడీపీ కొండపి మండల ఎంపీపీ అభ్యర్థిగా గొర్రెపాటి రామయ్య చౌదరిని పార్టీ అధిష్ఠానం మంగళవారం ఎంపిక చేసింది. గతంలో ఆయన కొండపి జడ్పీటీసీగా, మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. టీడీపీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్న రామయ్య చౌదరి, పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.